దర్శకుడు ప్రశాంత్ నీల్ విజన్ వెండితెరపైన ఆవిష్కృతమైంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం KGF2 మేనియా నడుస్తోంది. చాప్టర్ వన్ కు కొనసాగింపుగా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 అంతకు మించిన విజయాన్ని సొంతం చేసుకుంటున్నది.
ఇక రాఖీ భాయ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉండగా, ఆయనకు జోడీగా నటించిన బంగారం..అలియాస్ ..రీనా అలియాస్ శ్రీనిధి శెట్టి తన పాత్రతో ప్రేక్షకుల మెప్పు పొందింది.
KGF సినిమాతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ..వేరే చిత్రాల జోలికి పోకుండా ఈ మూవీ కోసమే డెడికేటెడ్ గా పని చేసింది. తన అందంతోనే కాకుండా అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది ఈ సుందరి.
చాప్టర్ టూలో శ్రీనిధి శెట్టి పాత్ర నిడివి ఎక్కువగా ఉందని, చక్కటి అభినయానికి అవకాశం ఈ భామకు దక్కిందని సినీ లవర్స్ అంటున్నారు. ఈ భామ ప్రస్తుతం కేజీఎఫ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు వచ్చిన అమ్మడు..ఫొటోషూట్ చేసింది.
ఆ లేటెస్ట్ ఫొటోషూట్ ఫొటోస్ ను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. సదరు ఫొటోల్లో శ్రీనిధి శెట్టి చాలా అందంగా కనబడుతోంది. బ్లాక్ శారీ లో అలా లేత అందాలను ఆరబోసి కుర్రకారుకు మత్తెక్కిస్తోంది.