Srinivas Goud : మరోసారి ఘాటుగా స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్…ప్రాణాలు కూడా లెక్కచేయబోం !

-

యాదాద్రి జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జలవివాదంపై మరోసారి ఘాటుగా స్పందించారు. తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగిన ఊరుకునే ప్రసక్తేలేదని.. ప్రాణాలు కూడా లెక్కచేయబోమని పేర్కొన్నారు. తెలంగాణ ఎవరు నష్టం చేసిన పార్టీలకు అతీతంగా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని… తెలంగాణ నీళ్లను ఎవరు దోసుకపోయిన అడ్డం నిలబడాలని పిలుపు నిచ్చారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కించపరిచేలా మాట్లాడిన అందరం ఏకతాటిపైకి నిలబడి కాపాడుకోవాలని.. రాజకీయాలు ఎన్నికల సమయంలో మాట్లాడుకోవాలని సూచించారు. దగపడ్డ తెలంగాణ నుంచి వచ్చిన మనం ఎంతో మంది ప్రాణాల త్యాగం తో తెలంగాణ తెచ్చుకున్నామన్నారు.

తెలంగాణ పేరు ఎత్తితే ఎంతో మంది ప్రాణాలు తీశారని… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర పేరు ఎత్తలేని పరిస్థితి నుంచి రాష్ట్రం తెచ్చుకున్నమని గుర్తు చేశారు. ఏ శక్తి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేదని.. ఎవరు కలసి వచ్చిన రాకపోయినా తెలంగాణ ను కాపాడుకుంటామని స్పష్టం చేశారు శ్రీనివాస్‌ గౌడ్‌.

Read more RELATED
Recommended to you

Latest news