రాజాసింగ్‌ను విడుదల చేయకపోతే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని శ్రీరామ్ సేన హెచ్చరించింది. పది రోజుల్లోగా ఎమ్మెల్యే రాజాసింగ్ తన ఇంట్లో ఉండాలని తెలంగాణ ప్రభుత్వానికి, శ్రీరామ్ సేన జాతీయ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ వార్నింగ్ ఇచ్చారు. ఆయనపై పీడీ యాక్టును ఉపసంహరించుకుని జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్తంగా హిందూ సంఘాలతో కలిసి లక్షల మందితో చలో హైదరాబాద్‌కు పిలుపు ఇచ్చి దిగ్బంధిస్తామని హెచ్చరించారు.
రాష్ట్రీయ శివాజీ సేన అధ్యక్షుడు శ్రీనివాసాచారి, హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర సమన్వయకర్త చేతన్ గాడితో కలిసి మంగళవారం ఆయన హైదరాబాద్‌లో రాజాసింగ్ కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. చర్లపల్లి జైలులో ఉన్న ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లగా అధికారులు తమకు అనుమతి ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.