రాముడిని అందుకే అందరూ పూజిస్తున్నారా?

-

శ్రీరాముడును అందరు ఆది పురుషుడుగా జీవిస్తారు.ఎంత అగ్ర రాజు అయిన కూడా ఎక్కడా పొగరును చూపించ లేదు..మహా రాజులు, చక్రవర్తులలో ఈ గుణం తక్కువగా ఉంటుంది. మానవ జాతికి ఆదర్శ పురుషుడుగా అవతరించిన రాముడు, తను మహారాజుగా పట్టాభిషిక్తుడవుతున్నానని తెలిసినా పొంగిపోలేదు.

కైకేయి అంతఃపురంలో మంధర మాట విని తన కొడుకు భరతుడే రాజు కావాలని, రాముడు పధ్నాలుగు ఏళ్ళు అరణ్యానికి వెళ్ళాలని పట్టు బట్టింది. పట్టాభిషేకానికి అలంకృతుడైన రాముడిని పిలిపించి ఈవిషయం చెప్పారు. శాంతమూర్తి అయిన రాముడు వింటూనే రాజ భోగాలను పక్కన పెట్టేశాడు. తండ్రి చెప్పిన ఒక్క మాటకు కట్టుబడి వున్నాడు.

తండ్రి మాటను దాటలేదు..తల్లి మాటను శిరసా వహించి అంత పెద్ద రాజు అయిన కూడా ఎక్కడ మాట తప్పకుండా అడవులకు వెళ్లాడు.అరణ్యంలో పుణ్య పురుషులైన మహర్షుల సన్నిధానంలో పరతత్వాన్ని ఉపాసించే అవకాశం అనుగ్రహించారు” అని కొనియాడాడు. “అన్నయ్యా, ఈరాజ్యం నీకు దక్క కుండా చేసేవారిని నా కరవాలానికి బలిఇస్తా”నని తమ్ముడు లక్ష్మణుడు. ఆగ్రహంతో నిప్పులు చెరగ్గా, శ్రీరాముడు ‘శాంతం’ అంటూ ఎంతో స్సగా అతనిని సముదాయించాడు.

అక్కడ అడవుల్లో రాముడు పడ్డ కష్టాలు వర్ణనాతీతం.. హంసతూలికా తల్పం, అనుచరగణం, దాస దాసీలతో భోగ భాగ్యాలు అనుభవించాల్సిన మహారాజు, కంద మూలాలు తింటూ, రాతి నేల మీద పడుకున్నాడు. ఎముకలు కొరికే చలిలో, ఎండా వానల్లో సర్వ కాల రాజనుచరగణంలో రాముడు ఓర్సును వీడలేదు. సహనాన్ని కోల్పోలేరు. పలు మార్లు సర్వావస్థలో రాముడు లక్ష్మణుడు అన్నయ్యా మనకు ఇదేం గతి అంటూ అసహనంతో కైకేయిని దూషించినా, అలా అనడం తప్పు అని ఓదార్చిన శ్రీ రామచంద్రుని ఓర్పు, సహనం అనితర సాధ్యం..అందుకే రాముడిని దయా మూర్తి అని అందరు కొనియాడుతున్నారు.. సకల గుణాలు కలిగిన పావన మూర్తి..జై శ్రీరామ్..

Read more RELATED
Recommended to you

Latest news