ఇస్రో అభివృద్ధి చేసిన ఉపగ్రహ వాహకనౌక (SSLV) నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో ఆదివారం ఉదయం 9.18 గంటలకు దీన్ని ప్రయోగించారు. ఈ వాహకనౌక ఈవోఎస్-02, ఆజాదీశాట్ ఉపగ్రహాలను దూసుకెళ్లింది. ఈవోఎస్-02 ఉపగ్రహం బరువు 140 కిలోల బరువు ఉంటుంది. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడంలో సాయపడుతుంది. అలాగే ఆజాదీశాట్‌ను 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. దీని బరువు 8 కిలోలు ఉంటుంది.
75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌కు గుర్తుగా ఆజాదీశాట్‌ను రూపొందించారు. ఈ ఉపగ్రహంలో రవీంద్రనాథ్ ఠాగూర్ పాడిన జాతీయ గీతం రికార్డ్ వెర్షన్‌ను పొందుపర్చారు. అయితే ఇప్పటివరకు ఇస్రో ఓ మోస్తరు బరువైన ఉపగ్రహాలను పీఎస్ఎల్‌వీ ద్వారానే కక్ష్యలోకి పంపేది. ఈ ఉపగ్రహ ప్రయోగానికి రూ.30 కోట్లు ఖర్చు అయింది. ఇది 10 నుంచి 500 కిలోల వరకు బరువున్న వాణిజ్య ఉపగ్రహాలను సమీప భూకక్ష్యలో ప్రవేశపెట్టగలదని శాస్త్రవేత్తలు తెలిపారు.