స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కి అలర్ట్..ఇలా చేస్తే చిక్కుల్లో పడక తప్పదు..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వీటి వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటోంది. అయితే తాజాగా కస్టమర్స్ ని అలెర్ట్ చేసింది. ఇలాంటి తప్పులను చెయ్యద్దని చెబుతోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే..

ఈ మధ్య సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అందుకనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో బ్యాంక్ వివరించింది. ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ ఉచ్చులో చిక్కుకునే వారి కోసం కొన్ని టిప్స్ ని బ్యాంక్ చెప్పింది. చాలా మంది ఈ లోన్ యాప్స్ కారణముగా మోసపోతున్నారు. అలా జరగకూడదని స్టేట్ బ్యాంక్ కొన్ని టిప్స్ ని చెప్పడం జరిగింది.

సైబర్ క్రైమ్స్‌ గురించి రిపోర్ట్ చేసేలా ప్రోత్సహిస్తుంది. cybercrime.gov.in ద్వారా సంప్రదించవచ్చని తెలిపింది. ఎక్కువగా చైనా లోన్ యాప్స్ వేధింపులు ఎక్కువవడం మూలాన కేంద్రం దృష్టి కి వెళ్ళింది. అందుకోసమే చర్యలు తీసుకుంటోంది. ఇల్లీగల్ లోన్ యాప్స్ ఉచ్చులో చిక్కుకుంటే వడ్డీ ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో
తీవ్ర ఇబ్బందుల్లో పడక తప్పదు. లోన్ రికవరీ మెథడ్స్ కూడా కష్టం ఉంటాయి. అందుకనే స్టేట్ బ్యాంక్ ఆదేశించినట్టు జాగ్రత్తగా ఉండడం మంచిది. లేదంటే ఇబ్బందులేమీ వుండవు.

Read more RELATED
Recommended to you

Latest news