గుడ్ న్యూస్.. స్టేట్ బ్యాంక్ హోమ్ లోన్స్ పై కీలక నిర్ణయం..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. తాజాగా హోమ్ లోన్స్ ని కూడా ఇస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. హోమ్ లోన్ పై వడ్డీని భారీగా తగ్గించేసింది బ్యాంక్. ఇప్పుడైతే స్టేట్ బ్యాంక్ హోమ్ లోన్స్ పైన వడ్డీ 8.40 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది.

అయితే ఈ లోన్ 8.40 శాతం నుంచి స్టార్ట్ కానుంది. అయితే క్రెడిట్ స్కోర్, ప్రొఫైల్‌ను బట్టి వడ్డీ రేటు వుంటుందట. వడ్డీ రేటుపై 25 బేసిస్ పాయింట్ డిస్కౌంట్ ని ప్రకటించింది బ్యాంక్. ఈ డిస్కౌంట్ ని 2023 జనవరి 31 వరకు పొందవచ్చు.

ఈ వడ్డీ రేటు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ పైన కూడా వస్తోంది. లోన్ టేకోవర్లకు 8.40 శాతం నుంచి టాప్ అప్ లోన్లకు 8.80 శాతం నుంచి వడ్డీ స్టార్ట్ అవుతోంది. హోమ్ లోన్లపై 0.25 శాతం, టాప్ అప్ లోన్లపై 0.15 శాతం తగ్గింపు వస్తుంది. ప్రాపర్టీపై అయితే 0.30 శాతం చొప్పున తగ్గింపు ఇస్తోంది. 2023 జనవరి 31 వరకు హోమ్ లోన్ ని తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు కట్టక్కర్లేదు.

లోన్ పొందేవారు ఇలా చెయ్యండి:

మొదట దీని కోసం యోనో ఎస్‌బీఐ యాప్ తెరవండి.
ఎడమ పక్కన మూడు గీతల పైన క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీరు లోన్స్ సెక్షన్‌లోకి వెళ్లాలి.
హోమ్ లోన్ మీద నొక్కండి. పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
ఇప్పుడు ఆదాయ మార్గాల వివరాలు ఇచ్చేసి… మిగిలిన డీటెయిల్స్ ని కూడా ఇచ్చేయండి.
మీకెంత లోన్ వస్తుందనేది తెలుస్తుంది. ఫైనల్ గా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అంతే.