టాటా సన్స్ గ్రూప్ మాజీ చైర్మన్ సైరన్ మిస్త్రి ఆదివారం నాడు మృతి చెందారు. ముంబై కి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ లో ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో సైరన్ మరణించారు. ఆయన వయసు 54 ఏళ్లు. సైరన్ మిస్త్రికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అహ్మదాబాద్ నుండి ముంబైకి తన కారులో వస్తున్న సమయంలో కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. సూర్య నది వంతెన పై ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తో పాటు కారులోని ఇద్దరూ గాయపడి చికిత్స పొందుతున్నారు. సైరన్ మరణంతో మన దేశ పారిశ్రామిక, వ్యాపారంగ ప్రముఖులు దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆయన మరణం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. మిస్త్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సైరన్ మిస్త్రి ఒక గొప్ప వ్యాపార దిగ్గజమని కొనియాడారు.