మహబూబాబాద్ గురుకుల పాఠశాలలో 20 మంది విద్యార్థినులకు ఆస్వస్థత

-

మహబూబాబాద్ జిల్లాలో కలుషిత ఆహారం తిని 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గురుకుల పాఠశాలలో వాంతులు, విరేచనాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గమనించిన తోటి విద్యార్థులు సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు.

ముందుగా పాఠశాల సిబ్బంది విద్యార్థినులకు పాఠశాలలో ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 20 మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా.. మరో 30 మంది స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరందిరికి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. కలుషితమైన ఆహారం తినడం వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని వెల్లడించారు.

తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి పరుగులు తీశారు. కలుషిత ఆహారం తినడం వల్లే తమ పిల్లలకు ఈ గతి పట్టిందని.. ఇప్పటికే పలుమార్లు ఆహార నాణ్యతపై, వసతి గృహంలో పారిశుద్ధ్యంపై సిబ్బందికి ఫిర్యాదు చేశామని.. అయినా వారి తీరు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news