స్టఫింగ్ మసాల కుల్చా.. మల్టీగ్రెయిన్ పిండితో ఇలా చేస్తే వీరలెవల్..!

-

మైదాతో చేసేవి రుచిగా ఉంటాయి కానీ.. అవి ఆరోగ్యానికి ఏం మంచివి కావు.. మైదాతో చేసేవే.. మల్టీగ్రెయిన్ పిండితో చేస్తే.. సూపర్ టేస్ట్ కమ్ హెల్తీ కూడా.. మసాలా కుల్చా పేరు మీరు వినే ఉంటారు.. ఈరోజు మనం మల్టీగ్రెయిన్స్ తో స్టఫింగ్ మసాలా కుల్చా ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.

స్టఫింగ్ మసాల కుల్చా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

మల్టీగ్రెయిన్ పిండి ఒకటిన్నర కప్పు
పెరుగు అరకప్పు
బీన్స్ చిన్న ముక్కలు అరకప్పు
క్యారెట్ అరకప్పు
పచ్చిబఠానీ ఆఫ్ కప్పు
పీనట్ బటర్ అరకప్పు
ఉడకపెట్టిన బంగాళదుంప ఒకటి
నల్లజీలకర్ర ఒక టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్
అల్లం తురుము ఒక టీ స్పూన్
లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్
మీగడ ఒక టేబుల్ స్పూన్
పసుపు కొద్దిగా
కొత్తిమీర కొద్దిగా

తయారు చేసే విధానం..

ఒక బౌల్ లో మల్టీ గ్రెయిన్ పిండి తీసుకుని అందులో బేకింగ్ సోడా, వంటసోడా , పెరుగు వేసేసి కొద్దిగా పల్చగా కలుపుకోండి. అరగంట పాటు అలానే ఉంచండి. పొయ్యిమీద నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో మీగడ వేసి అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిబఠానీలను లైట్ గ్రైండ్ చేసి వేయండి. వీటన్నింటిని తాలింపులో దోరగా వేగనివ్వండి. పీనట్ బటర్ కూడా వేసి వెజిటేబుల్ ను బాగా కలిపి ఉడపపెట్టిన బంగాళదుంపను తురిమి వేయండి.

ఫైనల్ గా లమెన్ జ్యూస్ వేసి తీసేయండి. ఇప్పుడు ముందుగా చేసుకున్న పిండి ఉందిగా అది చిన్న చిన్న ఉండలుగాచేసుకుని అందులో ఈ వెజిటేబుల్ స్టఫింగ్ పెట్టి చపాతీ కర్రతో నాన్ షేప్ లో చేసుకుని పైన నల్ల నువ్వులు, కొత్తిమీర వేయండి. ఇంకో వైపు కూడా నువ్వులు, కొత్తిమీర చల్లెసీ.. నాన్స్ లా చేసుకోండి. సిమ్ లో పెట్టి పోయ్యిమీద నాన్ స్టిక్ పాన్ మీద మెల్లగా కాల్చండి. మీగడ రాసుకుని రెండు వైపులా కాల్చుకోండి. పెరుగు కాంబినేష్ న్ తో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. హెల్తీ కూడా.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news