బంజారాహిల్స్ లో దారుణం..ప్రముఖ డాన్సర్ ను ముగ్గురు మహిళలు నగ్నంగా బంధించి !

-

బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ముంబైకి చెందిన డాన్సర్ బిశ్వాస్ కు బంజారాహిల్స్ లో వేధింపులు ఎదురైయ్యాయి. డాన్సర్‌ ను బట్టలు విప్పి నగ్నంగా రూంలో యువతి యువకులు బంధించారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఈ నెల 9న హైదరాబాద్ కు డాన్సర్‌ బిశ్వాస్ వచ్చాడు… తన స్నేహితురాలు సంజన కోరిక మేరకు హైదరాబాద్కు వచ్చిన బిశ్వాస్… తనకు తెలిసిన వారికి మసాజ్ చేయాలని బిశ్వాస్ ను కోరింది సంజన.

మరో స్నేహితురాలు కోమటి సునీతతో కలిసిన సంజన… తమకు తెలిసిన వారికి మసాజ్ తో పాటు శారీరక సుఖం ఇవ్వాలని కోరింది. ఈ నెల 12న జూబ్లీహిల్స్ కు వెళ్లిన బిశ్వాస్.. అప్పటికే అక్కడ కోమటి సునీతతో పాటు పలువురు పురుషులు ఉన్నారు. తాను కోరుకున్న వారిలో ఒకరు లేకపోవడంతో కోమటి సునీతతో గొడవ పడిన బిశ్వాస్… 100 ద్వారా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇక ఈ నెల 13న సంజన ఇంటికి వచ్చిన కోమటి సునీత.. జరిగిన గొడవ గురించి సంజనకు చెప్పింది. దీంతో ముగ్గురు కలిసి బిశ్వాస్ ను చిత్రహింసలకు గురి చేశారు. బిశ్వాస్ ను రూమ్ లో బంధించి చిత్ర హింసలకు గురి చేశారు ముగ్గురు మహిళలు. సానిటైజర్ తో బిశ్వాస్ పై దాడి చేశారు మహిళలు. అయితే.. నిన్న కిటిలో నుండి తప్పించుకున్న బిశ్వాస్.. బంజారాహిల్స్ పోలీస్ లకి ఫిర్యాదు చేశాడు. దీంతో సంజనా, కోమటి , సునీత లను అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news