ఓటిటిలోకి స్టైల్ స్టార్ అల్లు అర్జున్.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ఆహా

-

టాలీవుడ్ స్టార్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా దీనికి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చేసింది.

బాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పటికే అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె షో తో ఫాన్స్ ను ఉర్రూతలూగించిన ప్లాట్ఫామ్ ఆహా. ఇప్పుడు ఇదే ఫ్లాట్ ఫామ్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం తన ఫ్యాన్స్ ను అలరించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం సంస్థ ఆహా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించేసింది.

 

 

“ఇప్పటివరకు మీరు అల్లు అర్జున్ ని క్లాస్ గా మాస్గా చూసుంటారు ఈసారి ఓ బ్లాక్ బ్లాస్టర్ లుక్ తో ఆహా మీ ముందుకు తీసుకురానుంది కోసం రెడీగా ఉండండి..” అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్టు తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసలు విషయం ఏంటో అంటూ తెగ ఆరా తీస్తున్నారు. అల్లు అర్జున్ ఇప్పటికే ఆహాలో ప్రసారం అవుతున్న ఏదైనా షోలో కనిపిస్తారా లేదా బన్నీ తోనే ఒక కొత్త షో ప్రారంభం అవుతుందా అంటూ ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చలు మాత్రం మొదలైపోయాయి. అలాగే అల్లు అర్జున్ ఇండియన్ ఐడల్ కి గెస్ట్ గా రానున్నారా లేదా ఏదైనా డాన్స్ షో చేయనున్నారా.. లేదా అన్ స్టాపబుల్ లాంటి ఏదైనా షో ప్లాన్ చేస్తున్నారా.. మరి ఇంకా ఏదైనా అనే విషయం తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news