సీతక్క పక్కన ఉన్న ఆమె ఎందరికో ఆదర్శం..

-

కరోనా కష్టకాలంలో తన నియోజవర్గంలోని గిరిజనుల ఆకలిని తీర్చడానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఎంతగానో శ్రమిస్తున్నారు. గత 40 రోజులుగా పేదలకు నిత్యావసరాల పంపిణీ, ఆహారం అందించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకుసాగుతున్నారు. కనీసం రోడ్డు సదుపాయం కూడా లేని చోట్ల కూరగాయల బస్తాలు తానే స్వయంగా మోసుకుని వెళుతున్నారు. ఈ క్రమంలోనే తిండిలేని వారిని ఆదుకునేందుకు సీతక్క గో హంగర్ గో పేరిట చాలెంజ్ ప్రారంభించారు.

ఇటీవలి కాలంలో సీతక్కతో కలిసి సాయం అందిస్తున్నవారిలో ఓ మహిళ కూడా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. సీతక్కతో పాటు రాళ్లు, రప్పల్లో ప్రయాణిస్తూ ఆమెకు సాయంగా నిలుస్తున్నారు. అయితే ఆమె ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆమె పేరు తస్లిమా మహమ్మద్. ములుగు జిల్లా సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్నారు. కష్టకాలంలో పేదలకు అండగా ఉండాలన్నదే ఆమె ధ్యేయం. అందుకే ఇతర ప్రభుత్వ అధికారులకు భిన్నంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సర్వర్ చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించి తద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు. సాయం కోరిన వారికి, ఆపదలో ఉన్నవారికి తనవంతు చేయూత నందిస్తున్నారు. అలాగే ఖాళీ దొరికినప్పుడల్లా పొలం పనులు చేయడం తస్లిమాకు అలవాటు.

ములుగు మండలం రామచంద్రాపురానికి చెందిన మహ్మద్ ఫాతిమా-సర్వర్ దంపతుల కుమార్తె అయిన తస్లిమా.. 2009 గ్రూప్ 2లో ఉత్తీర్ణత సాధించి వరంగల్ జిల్లాలో సబ్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగం పొందారు. ఆ తర్వాత ములగుగు సబ్ రిజిస్ట్రార్‌గా విధుల్లో చేరారు. విధి నిర్వహణతో పాటు పలు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పీపుల్స్ ఫ్రెండ్లీ అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. ప్రపంచంలో అత్యుత్తమ జీవితం రైతుదే అని బలంగా నమ్ముతారారు కూడా. తన తండ్రి పేరిట నెలకొల్పిన ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేదలకు సాయం అందిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news