“మద్యపాన నిషేధ చిత్తశుద్ధి”పై జగన్ క్లారిటీ!

-

లాక్ డౌన్ వేళ మద్యం షాపులకు అనుమతులు ఇవ్వడంపై జగన్ ప్రభుత్వం ఎన్నడూలేనంతగా విమర్శలు ఎదుర్కొంటుందనే చెప్పాలి! అధికారం చేపట్టినప్పటినుంచీ రాని స్థాయిలో… మద్యం దుకాణాలు తెరవడానికి అనుమతి ఇచ్చేసరికి విమర్శలు వచ్చాయి. ఈ నిర్ణయం మందుబాబులకు “కరోనాకి మందు కనుగొన్నంత” ఆనందం కలిగిన మాట వాస్తవమే అయినా… మిగిలిన వర్గాల నుంచి కాస్త వ్యతిరేకత వచ్చిందనే చెప్పాలి. ఈ క్రమంలో అవి కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న నిర్ణయమే తప్ప మరొకటి కాదని ఏపీ ప్రభుత్వం ప్రకటించినా కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఆగని పరిస్థితి. ఇదే క్రమంలో ధరలు పెంచడం కూడా.. మద్యపాన నియంత్రణలో భాగమే అని ప్రభుత్వం ప్రకటించింది కూడా! ఈ విషయాలపై ఏపీ ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు!

ఈ సందర్భంగా… తాను అన్న మాటకు కట్టుబడే ఉన్నానని, దశల వారీ మద్యపాన నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మద్యపాన నియంత్రణలో భాగంగానే మందుబాబులను, మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి లిక్కర్‌ ధరలను భారీగా పెంచినట్టు జగన్ వెల్లండిచారు. మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి 75 శాతం పెంచాలని.. కానీ… ఏపీ మాత్రం 25 శాతం పెంచి తగ్గించాలనుకుంటే.. ఢిల్లీలో 70 శాతం పెంచారని, దాంతో 75 (25 + 50) శాతం పెంచి గట్టి చర్యలు తీసుకుంటున్నామని జగన్ వివరణ ఇచ్చారు! ఇదే క్రమంలో మద్యం దుకాణాల సంఖ్యను ఇప్పటికే 20 శాతం తగ్గించామని ప్రకటించిన జగన్… మరో 13 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు!

ఈ లెక్కన చూసుకుంటే… వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 33 శాతం మేర వైన్ షాపులు తగ్గించినట్టు అవుతుంది. ఇదే క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 43 వేల బెల్టు షాపులను రద్దు చేశాం అని.. ఇక గ్రామాల్లో బెల్టు షాపులు శాశ్వతంగా లేకుండా చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నామని జగన్ చెబుతున్నారు. అందులో భాగంగానే ప్రైవేటు వ్యక్తులకు కాకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుందని జగన్ చెబుతున్నారు! తాను మాట తప్పలేదని… మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యం విక్రయించే వేళలలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటవరకూ పరిమితం చేశామని జగన్ నొక్కి వక్కాణించారు! ఈ వివరణతో… తాను ఇచ్చిన మాట ప్రకారం విడతల వారీగా మద్యపాన నియంత్రణకు కట్టుబడి ఉన్నామని… ఇప్పుడేదో మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చినంత మాత్రాన్న తాను మాట తప్పినట్లు కాదని జగన్ చెప్పినట్లయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news