Success story: తేనే ఉత్పత్తి తో కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్న యువతి..

-

ఈరోజుల్లో చదువు ఒక్కటే అన్నం పెట్టలేదు.. వారికున్న టాలెంట్, కొత్తగా ఏదైనా సాధించాలి అనే కోరికల తో చాలా మంది యువత ఉన్నత స్థానాల్లో ఉంటూన్నారు.. కొందరు మహిళలు సైతం అందరిని ఆశ్చర్యపరిచేలా విజయాలను సొంతం చేసుకుంటున్నారు.. ఈ మధ్య ఎంతో మంది మహిళలు సొంతంగా బిజినెస్ లు చేసుకుంటూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇక తాజాగా ఓ మహిళలు తేనే వ్యాపారం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలిచింది… ఆ యువతి సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ రోజుల్లో లక్షల జీతం వచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదులుకుని వ్యవసాయ అనుబంధ రంగాల్లోకి ఎవరైనా అడుగు పెట్టడం అంటే సాహసమనే చెప్పాలి..తేనె టీగలకు ఆయా కాలాల్లో లభించే పూలను బట్టి తేనే రంగు రుచిలో తేడాలు వస్తుంటాయి. కాని మనకు మార్కెట్లో దొరికే ప్రముఖ కంపెనీల బ్రాండ్లు కూడా అన్ని కాలాల్లో ఒకే రకంగా ఉంటోంది. దీనికి కారణం బెల్లం, పంచదారతో తేనెను కల్తీ చేయడమే..కానీ నల్గొండ కు చెందిన అనూష అలాంటి సాహసమే చేసింది. నెలకు 600 కిలోల స్వచ్ఛమైన తేనె ఉత్పత్తి చేస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలిచింది. మార్కెట్లో లభించే తెనేలో 96 శాతం కల్తీవే. ఎందుకంటే తేనె అనేది వివిధ కాలాల్లో రంగు, రుచి మారుతూ ఉంటుంది…

మొదట రూ.20 లక్షలతో తేనె ఉత్పత్తికి కావాల్సిన పెట్టెలను అనూష కొనుగోలు చేశారు. వివిధ కాలాల్లో వాటిని పలు ప్రాంతాలకు మారుస్తూ తేనె ఉత్పత్తి చేస్తోంది.తెలంగాణలోని వికారాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, యాచారం ఇలా అటవీ ప్రాంతాల్లో తేనె పెట్టెలను ఉంచడం ద్వారా నెలకు 600 కిలోల తేనె ఉత్పత్తి చేస్తోంది..దూర ప్రాంతాలకు కొరియర్ ద్వారా తెనే పంపిస్తున్నారు. ఇలా ఏటా రూ.2 కోట్ల విలువైన తేనె ఉత్పత్తి చేస్తూ అందరికి ఆదర్శంగా మారింది.. హ్యాట్సాప్ అనూష..

Read more RELATED
Recommended to you

Latest news