ఆరోగ్యాంధ్రప్రదేశ్ సృష్టించడమే సీఎం జగన్ లక్ష్యమని మంత్రి విడదల రజిని అన్నారు. టెక్నాలజీ సాయంతో రోగులకు మెరుగైన వైద్యం అందబోతోంది.. ప్రతి పౌరుని ఆరోగ్య వివరాలు డిజిటల్ టెక్నాలజీతో అందుబాటులోకి తెచ్చాం.. డిజిటల్ హెల్త్‌లో ఏపీ దేశంలో రికార్డు సృష్టించిందని తెలిపారు మంత్రి విడదల రజిని.
లింగనిర్థారణ పరీక్షలు ఎలా జరగుతున్నాయనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని చెప్పారు. ఎక్కడా కూడా పుట్టబోయే బిడ్డ ఎవరో చెప్పే పరిస్థితులు ఉండటానికి వీల్లేదన్నారు. లింగనిర్థారణ పరీక్షలు చట్ట రిత్యా నేరం అని తెలిపేలా అన్ని ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో గోడపత్రికలు ఏర్పాటుచేయాలని సూచించారు. ప్రజల్లో కూడా ఈ విషయంపై అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఏఎన్ ఎంలు, ఆశా వర్కర్లకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.