తెలంగాణ రవాణా శాఖకు కేసీఆర్ గుడ్ న్యూస్.. 

-

తెలంగాణ రవాణా శాఖకు కేసీఆర్ గుడ్ న్యూస్  చెప్పారు. తెలంగాణ రవాణా శాఖలో భారీగా పదోన్నతులు కల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారిగా 87 మంది అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లకు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లుగా ప్రమోషన్ లభించింది.  ఐదో జోన్ లో 28 మందికి, ఆరో జోన్ లో 59 మందికి ప్రమోషన్లు ఇచ్చింది తెలంగాణా ప్రభుత్వం. 2013 నుంచి పదోన్నతుల కోసం ఎదురు చూసిన ఎఎంవిఐలకు ఇది శుభవార్త అని చెప్పక తప్పదు.

ఎన్నో సంవత్సరాల తరువాత ప్రమోషన్స్ ఇవ్వడంతో ఎంవిఐలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి దుబ్బాక ఎన్నికల సహా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కూడా ప్రభుత్వ ఉద్యోగుల నుండి ప్రభుత్వానికి వ్యతిరేకత వ్యక్తం అవుతున్న క్రమంలో ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు.

Read more RELATED
Recommended to you

Latest news