అల్లు అర్జున్‌కు అవార్డ్‌.. భావోద్వేగంతో బన్నీని హత్తుకున్న సుకుమార్‌

-

పుష్ప మూవీలో నటనకు ఉత్తమ జాతీయ అవార్డు దక్కించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయన్ను కీర్తిస్తున్నాయి. ఇందులో స్పెషల్ గా ఓ మెసేజ్ మాత్రం వైరల్ అవుతుంది.. అదే జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన గ్రీటింగ్స్.. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డు నెలకొల్పారు.

Allu arjun : బెస్ట్ యాక్ట‌ర్‌గా అల్లు అర్జున్‌.. సుకుమార్ ఆనందం చూశారా..! -  10TV Telugu

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటన వెలువడగానే బన్నీ ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి తదితరులు అల్లు వారి ఇంటికి విచ్చేసి తమ హీరోకు శుభాకాంక్షలు తెలియజేశారు.సుకుమార్ అయితే తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.

 

అల్లు అర్జున్ ను గట్టిగా హత్తుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇరువురి ఆత్మీయత అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. అందరూ కరతాళ ధ్వనులతో అల్లు అర్జున్, సుకుమార్ ద్వయాన్ని అభినందించారు. బన్నీ తండ్రి అల్లు అరవింద్, అర్ధాంగి స్నేహ కూడా ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు.దీనికి సంబంధించిన వీడియోను చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ లో పంచుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news