Suma Kanakala: యాంకర్ సుమక్క హడావిడి.. ‘జయమ్మ పంచాయితీ’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

-

బుల్లితెర మహారాణిగా ఇన్నాళ్లు ఏలిన సుమ..త్వరలో వెండితెరపైన సందడి చేయబోతున్నారు. ఆమె లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఫిల్మ్ ‘జయమ్మ పంచాయితీ’. ఈ నెల 22న పిక్చర్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ హడావిడి స్టార్ట్ చేసేసింది యాంకర్ సుమక్క.

సాధారణంగా వేరే ఇతర చిత్రాల విడుదలయ్యే క్రమంలోనే వారందరినీ ఇంటర్వ్యూ చేసే సుమ.. తన సినిమాకు ఎవరి ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్తుందనేది చూడాలి. ఈ నేపథ్యంలోనే సుమక్క.. సినిమాకు సంబంధించిన ట్రైలర్ గురించి ప్రకటించారు. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.

ఈ నెల 16న ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకుని సినీ, బుల్లితెర ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెండితెరపైన సుమ.. ఏ విధంగా ప్రేక్షకుల మెప్పు పొందుతారనేది ఆసక్తికరంగా మారింది. ‘వావ్. , వెయిటింగ్, ఎప్పుడెప్పుడు ట్రైలర్ చూద్దామా అన్నట్లుంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తు్న్నారు. విజయ్ కుమార్ కలివరపు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు.

https://www.instagram.com/p/CcVaYmoJwmu/

Read more RELATED
Recommended to you

Latest news