ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం మీద సినీ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం బాధాకరమన్న ఆయన ఆలయాల్లో సీసీ కెమెరాలతో పాటు భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్నారు. జగన్ కు చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రతి పక్షాల కుట్ర అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చెయ్యకూడదని అన్న ఆయన నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాల్సిందేనని అన్నారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల వద్ద పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఆలయాలు, చర్చ్ లు, మసీదులకు సంబంధించి నిర్వాహకులతో సమావేశం నిర్వహిస్తున్నారు పోలీసులు. ఆయా దేవాలయాల్లో సీసీ కెమెరాల తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పోలీసు నిఘా ను సైతం పెంచుతున్నట్లు అధికారుల వెల్లడించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి.