ఈ వేసవి ఎండలని తట్టుకోలేకపోతున్నారా..? చల్లగా ఏదైనా టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీరు కచ్చితంగా షిమ్లా టూర్ ప్యాకేజీని చూడాల్సిందే. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి షిమ్లా టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ‘హ్యాపీ హిమాచల్ అండ్ పాపులర్ పంజాబ్’ పేరుతో ఈ ప్యాకేజీని తీసుకు వచ్చారు. ఇక ఈ టూర్ కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
ఏప్రిల్ 10న ఈ టూర్ ప్రారంభం అవుతోంది. ఫ్లైట్‌లో వెళ్లి అమృత్‌సర్, చండీగఢ్, ధర్మశాల, షిమ్లా వంటివి చూసి వచ్చేయచ్చు. ఐఆర్‌సీటీసీ షిమ్లా టూర్ 7 రాత్రులు, 8 రోజుల పాటు ఉంటుంది. ‘హ్యాపీ హిమాచల్ అండ్ పాపులర్ పంజాబ్’ టూర్ ప్యాకేజీ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. ఉదయం 11:10 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరితే 1:45 గంటలకు చండీగఢ్ వెళ్ళచ్చు. రాక్ గార్డెన్, సుఖ్నాలేక్ ని చూడచ్చు.
అక్కడే రాత్రి స్టే చెయ్యాలి. రెండో రోజు షిమ్లాకు బయల్దేరాలి. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత మాల్ సందర్శన ఆ తరవాత రాత్రికి షిమ్లాలోనే స్టే చెయ్యాలి. మూడో రోజు కుఫ్రీ సైట్‌సీయింగ్, షిమ్లా లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. రాత్రి అక్కడే స్టే చెయ్యాలి. నాలుగో రోజు ఉదయం ధర్మశాల చూడచ్చు. జ్వాలా దేవి ఆలయాన్ని చూసి రాత్రికి ధర్మశాలలో బస చేయాలి.
ఐదో రోజు ధర్మశాల లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. ఐదో రోజు రాత్రికి ధర్మశాలలో స్టే చెయ్యాలి. ఆరో రోజు అమృత్‌సర్‌కు వెళ్ళాలి. రాత్రికి అమృత్‌సర్‌లో స్టే చెయ్యాలి. ఏడో రోజు జలియన్‌వాలాబాగ్, గోల్డెన్ టెంపుల్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత వాఘా బార్డర్‌కు వెళ్లొచ్చు. రాత్రికి అమృత్‌సర్‌లో స్టే చేయాలి. ఇక ధరల విషయంలోకి వస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.33,100, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.34,100, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.46,950 చెల్లించాలి.