Sonu Sood: మండుటెండలు..చల్లని బీరు కావాలని నెటిజన్ రిక్వెస్ట్..అదిరిపోయే రిప్లయి ఇచ్చిన సోనుసూద్

-

రియల్ హీరో సోనుసూద్ కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో చేసిన సేవలు అందరికీ తెలసిందే. కలియుగ దాన వీర శూర కర్ణుడిగా సోనుసూద్ ను ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు కీర్తించారు. ఆపద ఎక్కడున్నా ఆదుకుని..వలస కూలీలు, సామాన్యులు, మధ్య తరగతి వాళ్లు ఇలా ప్రతీ ఒక్కరికి తన వంతు సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు సోనుసూద్.

తెలుగింటి అల్లుడైన సోనుసూద్‌ సోషల్ మీడియాలో కష్టమొచ్చిందని మెసేజ్ చేస్తే చాలు.. ఆదుకునే ప్యారలల్ సర్కారుగా మారిపోయారు. కాగా, సోనుసూద్ కు అప్పుడప్పుడు ఫన్నీ రిక్వెస్ట్ లు కూడా వెళ్తుంటాయి. ఈ క్రమంలోనే అటువంటి ఫన్నీ క్వశ్చన్స్ కు తనదైన డిఫరెంట్ స్టైల్ లో ఆన్సర్స్ ఇస్తుంటారు సోనుసూద్. తాజాగా ఓ అభిమాని సోనుసూద్ ను ట్విట్టర్ వేదికగా ఫన్నీ రిక్వెస్ట్ చేశారు.

‘చల్లి కాలంలో దుప్పట్లను పంచారు. ఈ నేపథ్యంలోనే మండుటెండల్లో వేసవి కాలం కాబట్టి చల్లని బీరు అందిస్తే బాగుంటుంది’ అని సోనుసూద్ ను ట్వి్ట్టర్ వేదికగా రిక్వెస్ట్ చేశారు. ఈ విషయమై స్పందించాలని సోనుసూద్ ను కోరారు. కాగా, నెటిజన్ రిక్వెస్ట్ కు ఫన్నీగా రియాక్ట్ అయి తనదైన స్టైల్ లో రిప్లయి ఇచ్చారు రియల్ హీరో సోనుభాయ్.

sonu sood
sonu sood

‘బీర్ తో పాటు స్టఫ్ కూడా ఉంటే బాగుంటుంది కదా’ అని ట్వీట్ ద్వారా రిప్లయి ఇచ్చారు. అది చూసి నెటిజన్లు ‘వావ్ సోనుభాయ్ ఎపిక్ రిప్లయి’, ‘యూఆర్ గ్రేట్’, ‘సూపర్ రిప్లయి’, గ్రేట్ బాస్’ అని కామెంట్స్ చేస్తు్న్నారు. సోనుసూద్ తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో చాలా చిత్రాల్లో ప్రతి కథానాయకుడి పాత్ర పోషించిన సోనుసూద్.. ఈ నెల 29న విడుదల కానున్న మెగాస్టార్ ‘ఆచార్య’ ఫిల్మ్‌లో కీ రోల్ ప్లే చేశారు. ‘తమిళరసన్, ఫతేహ్’ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్న సోనుసూద్.. ‘రోడీస్ 18’ సీజన్ కు హోస్ట్ గానూ వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news