విష్ణువర్ధన్ రెడ్డి గోచి పెట్టుకుని తిరుగుతున్నారా ? ఒక రేంజ్ లో ఫైర్ !

-

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ నిప్పులు చెరిగారు. అమరావతి రాజధాని కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న మహిళలపై బీజేపీ నేతలు అవాకులు చెవాకులు పేలతారా ? అని ఆమె ఫైర్ అయ్యారు. మహిళా అని కూడా గౌరవం లేకుండా వారి వస్త్రధారణ గురించి మాట్లాడతారా ? 50 వేలు చీరలు కట్టుకున్నారని అంటున్నారు… విష్ణువర్ధన్ రెడ్డి ఏమైనా గోచి పెట్టుకుని తిరుగుతున్నారా? అని ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు.

మహిళల చీరల గురించి విష్ణువర్ధన్ రెడ్డికి ఎందుకు… విష్ణువర్ధన్ రెడ్డి ఏమైనా మహిళా ? అని ఆమె ప్రశ్నించారు. ప్రధాని చేతులతో ఊపిరి పోసుకున్న అమరావతిని ముఖ్యమంత్రి జగన్ చంపుతుంటే విష్ణువర్ధన్ రెడ్డి మిగతా బీజేపి నేతలు ఎక్కడ దాక్కున్నారు ? అని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేరు కానీ ఉద్యమం చేస్తున్న మహిళలపై విమర్శలకు మాత్రం ముందు ఉంటున్నారని ఆమె అన్నారు. అస్సలు అమరావతిపై బీజేపీ స్టాండ్ ఏంటి ? అని ఆమె ప్రశ్నించారు. ఇకనైనా విష్ణువర్ధన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆమె వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news