పాత గొడవల్ని బయటపెడుతూ రచ్చ చేసిన సన్నీ – యాంకర్ రవి..!!

-

బిగ్ బాస్ హౌస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న ఈ షో ద్వారా ఎంతోమంది మంచి పాపులారిటీని కూడా సొంతం చేసుకున్నారు. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో రాజకీయాలకు కొదవ ఉండదు. కానీ ఒక 15 మంది ఒకేసారి గుమికూడి రాజకీయాలు చేస్తే ఇక దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ లందరూ ఒకే చోట కలిసి చేసే పర్ఫామెన్స్ ఎంత పీక్స్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఇదే తరహాలో స్టార్ మా ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.

ఇక ఎవరైనా సరే ఒకసారి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు అంటే వాళ్ల క్రేజ్ ను బట్టి బిగ్ బాస్ కొన్ని రకాల అగ్రిమెంట్లు కూడా చేయించుకుంటూ ఉంటుంది. ఇక చచ్చినట్టు రెండు మూడు సంవత్సరాల పాటు ఏ షోకి పిలిచినా సరే ఆ షో కి వెళ్లాల్సిందే. ఇక ఈ క్రమంలోనే ఒకే సారి జబర్దస్త్ షోలో కనిపించిన వాళ్ళు సుమారుగా రెండు సంవత్సరాల పాటు విరివిగా షోలలో కనిపిస్తూ ఉంటారు. ఇక తాజాగా ఈ క్రమంలోని బిగ్ బాస్ బాటిల్ అంటూ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ మధ్య మంట పెట్టే ఒక కార్యక్రమాన్ని స్టార్ మా నిర్వహిస్తోంది.

తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో యాంకర్ రవి అలాగే సన్నీ మద్య పెద్ద గొడవ జరిగింది. ముఖ్యంగా బిగ్ బాస్ అనేది గొడవలు పెట్టడమే కాన్సెప్ట్ గా ముందుకు వెళుతుంది. తాజా కార్యక్రమంలో కూడా వీరు ఇరువురు గొడవ పడుతూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక వీరిద్దరూ కూడా పాత గొడవలను గుర్తు చేసుకుంటూ విపరీతంగా గొడవపడ్డారు. ఎపిసోడ్ లో భాంగానే అమ్మాయిలు – అబ్బాయిల మధ్య జరిగే టాస్కులో.. అమ్మాయిలు చెప్పిన పనులు అన్నింటినీ అబ్బాయిలు చేస్తున్నారు. కానీ అబ్బాయిలు చెప్పిన పనులను అమ్మాయిలు చేయడం లేదని సన్ని గొడవ మొదలుపెట్టాడు. రవిని పిలిచి మా వాళ్ళు పనిష్మెంట్ అంటే వెంటనే చేస్తున్నారు. వాళ్ళు మాత్రం ఏం చేయడం లేదు అంటాడు.. నువ్వు వాళ్లకే సపోర్ట్ చేస్తున్నావని రవి పై ఆగ్రహం చేశాడు సన్నీ. ఒకరినొకరు తోసుకుంటూ చాలా గొడవ చేశారు ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news