మునుగోడు పోరు…అభ్యర్ధులు రెడీ?

-

ఇంకా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరలేదు…ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు…కానీ అప్పుడే మునుగోడు ఉపఎన్నిక వచ్చేస్తుందని మీడియాలో కథనాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి… ఉపఎన్నిక రావడమే కాదు… ఆ ఎన్నికలో గెలిచేందుకు ప్రధాన పార్టీలు వ్యూహ – ప్రతివ్యూహాలతో రెడీ అవుతున్నాయని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవాలు లేకపోలేదు. ఇప్పటికే పార్టీ మారడానికి కోమటిరెడ్డి రెడీ అయ్యారు… కాకపోతే బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీలోకి రమ్మని చెప్పినట్లు తెలుస్తోంది.

komatireddy rajgopal reddy

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే… ఉపఎన్నిక వస్తుంది..ఆ ఎన్నికలో గెలిచి… టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలకు ఒకేసారి చెక్ పెట్టాలనేది బీజేపీ వ్యూహం. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయంలో రాజగోపాల్ కాస్త ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది… కానీ బీజేపీ అధిష్టానం ఫుల్ సపోర్ట్ ఇస్తామని హామీ ఇస్తుంది… దీంతో వచ్చే నెలలో రాజగోపాల్ రాజీనామా చేసి బీజేపీలో చేరతారని తెలుస్తోంది. అలాగే ఈ ఏడాది చివరకు గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి.. అప్పుడే మునుగోడు ఉపఎన్నిక కూడా జరుగుతుందని ప్రచారం వస్తుంది.

ఇక ఉపఎన్నికపై టీఆర్ఎస్ ముందు నుంచి అప్రమత్తంగా ఉంది.. ఇప్పటికే కేసీఆర్… మంత్రి జగదీష్ రెడ్డితో మునుగోడులో పరిస్తితులపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే మునుగోడు ప్రజలకు వరాలు కురిపెంచేందుకు కూడా టీఆర్ఎస్ రెడీ అయింది. అలాగే ఉపఎన్నికలో పోటీకి బలమైన అభ్యర్ధిని నిలబెట్టేందుకు కసరత్తు చేస్తుంది. కోమటిరెడ్డి లాంటి బలమైన నేతని ఢీకొట్టేలా అభ్యర్ధిని రెడీ చేస్తుంది.

ఇదే క్రమంలో టీఆర్ఎస్ తరుపున సీటు కోసం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్ది…అటు మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ పోటీ పడుతున్నారు. అలాగే కర్నాటి విద్యాసాగర్, కంచర్ల కృష్ణారెడ్డి సైతం టికెట్ రేసులో ఉన్నారు. ఇక మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి రేసులో మాజీ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి ఉన్నారు. ఇప్పటికే స్రవంతితో…రేవంత్ రెడ్డి చర్చలు చేసినట్లు తెలుస్తోంది. అటు ఎలాగో బీజేపీ నుంచి కోమటిరెడ్డి బరిలో దిగడం ఖాయం. మొత్తానికి మునుగోడు ఉపఎన్నికకు అన్నీ పార్టీలు రెడీ అయిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news