నెట్టింట రచ్చ చేస్తున్న సన్నిలియోన్‌ వీడియో

-

కేవలం అందంతోనే కాదు తన నటనతో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్. ఈమె సోషల్ మీడియాలో
ఒక్క పోస్ట్‌ పెట్టిందంటే చాలు జనాలు ఎగబడుతూ కామెంట్లు పెడతారు. నెట్టింట చురుకుగా ఉండే సన్నీలియోన్‌ ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తూ ఫాలోవర్లు, అభిమానుల్లో జోష్ తెస్తూ ఉండడం సహజం. ఒక్కొక్క సినిమాకు కొత్తగా కనిపిస్తూ సందడి చేసే సన్నీలియోన్‌ తాజాగా మరో వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ వదిలింది. డైనోసార్ అస్థిపంజరం ముందు నిలబడి తీసిన సెల్ఫీ వీడియోను సన్నీలియోన్ షేర్ చేసుకుంది.

Sunny Leone Videos (@sunny_leone_vid) / Twitter

ఇంతకీ ఈ బ్యూటీ ఎక్కడికెళ్లిందో ఎలాంటి హింట్‌ ఇవ్వకుండా, కేవలం లవ్ సింబల్స్ ఎమోజీని మాత్రమే క్యాప్షన్‌గా పెట్టింది. సన్నీలియోన్‌ ఏదైనా మ్యూజియంకు వెళ్లిందా లేదా, షూటింగ్ స్పాట్‌కు వెళ్లిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. సన్నీలియోన్‌ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. సన్నీలియోన్‌ గతేడాది తెలుగులో మంచు విష్ణుతో కలిసి జిన్నా అనే సినిమాలో నటించడం అందరికి తెలిసిందే. జిన్నాలో రేణుక పాత్రలో ఈమె పాత్రకు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం సన్నీలియోన్ మలయాళంలో తెరకెక్కుతున్న రంగీలాలో నటిస్తోంది. .

 

 

Read more RELATED
Recommended to you

Latest news