ఢిల్లీలోని జంతర్-మంతర్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరాహార దీక్ష విజయవంతంగా ముగిసింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎంపీ కే కేశవరావు ఎమ్మెల్సీ కవితకు నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం మా పోరాటం కొనసాగుతోంది. మహిళా రిజర్వేషన్ సాధించే వరకు ఆగేది లేదు. మోదీ సర్కార్ తలచుకుంటే ఈ బిల్లు సులువుగా పాసవుతుంది.
డిసెంబర్‌లో పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. రాష్ట్రపతికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ప్రారంఇంచిన ఈ పోరాటం ఇంకా ఉధృతమవుతుంది. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరం సాధించి తీరాలి అని కవిత వ్యక్తపరిచారు. కవిత దీక్షలో ఆప్ నేతలు సంజయ్ సింగ్, చిత్ర సర్వార, నరేష్ గుజ్రాల్ (అకాలీదళ్) శివసేన ప్రతినిధులు, అంజుమ్ జావేద్ మిర్జా (పీడీపీ), షమీ ఫిర్దౌజ్ (నేషనల్ కాన్ఫరెన్స్), సుస్మితా దేవ్ (టీఎంసీ), కేసీ త్యాగి (జేడీయూ), సీమా మాలిక్ (ఎన్‌సీపీ), కే.నారాయణ (సీపీఐ), సీతారాం ఏచూరి (సీపీఎం), పూజ శుక్లా (ఎస్‌పీ), శ్యామ్ రాజక్ (ఆర్ఎల్‌డీ), కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్ సహా పలు విపక్ష పార్టీల నేతలు, ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.