సూపర్ స్కీమ్.. ప్రతీ నెలా భార్యాభర్తలకు రూ.41,000..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీముల వలన ఎన్నో లాభాలు ఉంటాయి. చిన్నమొత్తాల పొదుపు పథకాలు ని కూడా కేంద్రం తీసుకు రావడం జరిగింది. ఈ పథకాల్లో కూడా కొన్ని పాపులర్ స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో డబ్బులు పెడితే ఎంతో బెనిఫిట్ ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ని కూడా కేంద్రం తెచ్చింది. ఈ స్కీము వడ్డీ రేట్లు కూడా పెరిగింది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టచ్చు.

కానీ ఇప్పుడు ఈ లిమిట్‌ను రూ.30 లక్షలకు పెంచింది. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి ఈ కొత్త రూల్ వచ్చింది. దీంతో 8 శాతంగా ఉన్న వడ్డీ రేటు 8.20 శాతానికి వెళ్ళింది. ప్రస్తుతం కూడా ఇదే వడ్డీ లభిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో చాలా మంది చేరారు. ఈ మూడు నెలల్లోనే రూ.55,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

60 ఏళ్లు దాటిన వృద్ధులు ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టుకోవచ్చు. ఈ స్కీమ్‌లో ఐదేళ్ల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కావాలంటే ఇంకో 3 ఏళ్లు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ పథకంలో భార్యాభర్తలు పెట్టుబడి పెడితే గరిష్టంగా నెలకు రూ.41,000 వస్తాయి. రూ.30 లక్షలు పొదుపు చేసుకోవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి రూ.60 లక్షలు జమ చేస్తే, ప్రతీ ఏటా రూ.4,92,000 వడ్డీ వస్తుంది. నెలకు రూ.41,000 వడ్డీ ని పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version