నేడు అమరావతిపై సుప్రీం కోర్టు లో విచారణ జరుగనుంది. అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు తీర్పును యధాతధంగా అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించారు అమరావతి రైతులు.
ఈ రెండు పిటీషన్లను న్యాయమూర్తి కె. ఎం. జోసెఫ్, బివి నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నేడు విచారించనుంది. అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల గురించి తమకు తెలియదని పేర్కొంది కేంద్రం. త్వరలోనే వైజాగ్ కు మకాం మార్చుతానని స్పష్టం చేశారు సీఎం జగన్. ఈ విరుద్ద ప్రకటనల నేపథ్యంలో నేడు అమరావతి విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుప్రీం కోర్టు దీనిపై ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.