రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసుపై సుప్రీం విచారణ.. ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని ఆదేశం

-

ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌పై ఆయన కుమారుడు భరత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. రెండున్నరేళ్లుగా రఘురామను రాష్ట్రానికి రాకుండా అడ్డంకులు సృష్టించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వమే కస్టోడియల్‌ టార్చర్‌కు గురిచేసిందని కోర్టుకు తెలిపారు.

వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం లేదని.. సీబీఐ విచారణకు ఆదేశించడానికి ప్రభుత్వ వాదనలతో పనిలేదని భరత్‌ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. దీంతో ప్రభుత్వ వాదన విన్న తర్వాతే సీబీఐ విచారణపై నిర్ణయిస్తామని చెప్పిన ధర్మాసనం.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది

Read more RELATED
Recommended to you

Latest news