కోమటిరెడ్డికి పాజిటివ్ తక్కువే?

-

హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌తో పోలిస్తే…మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అంత పాజిటివ్ లేదా? ఈటల మాదిరిగా కోమటిరెడ్డికి గెలుపు అవకాశాలు ఉన్నాయా? అంటే ప్రస్తుతం పరిస్తితులని చూస్తే పెద్దగా ఉన్నట్లు కనిపించడం లేదు. కాకపోతే టీఆర్ఎస్ పై వ్యతిరేకత, కాంగ్రెస్ వీక్ అవ్వడం, బీజేపీ పుంజుకోవడం లాంటి అంశాలు కోమటిరెడ్డికి కలిసి రావొచ్చు. కానీ హుజూరాబాద్ మాదిరిగా మునుగోడు ఉండదు.

ఎందుకంటే అక్కడ పరిస్తితులు వేరు…ఈటలని కేసీఆర్ కావాలని టార్గెట్ చేశారని ప్రజలు భావించారు. ఆయన్ని కావాలని పార్టీ నుంచి బయటకెళ్లెలా చేయడం, అలాగే హుజూరాబాద్‌లో ఈటలని దెబ్బతీయడానికి టీఆర్ఎస్ అధికార బలమంత పెట్టింది..అందుకే అక్కడి ప్రజలు సానుభూతితో ఈటలకు అండగా నిలబడ్డారు. అలాగే ఈటలకు ఉన్న ఫాలోయింగ్ బాగా ప్లస్ అయింది. కానీ మునుగోడులో కోమటిరెడ్డికి ఇలాంటి ప్లస్ పాయింట్స్ లేవు.

పైగా వేరే విధంగా మునుగోడు ఉపఎన్నిక రాలేదు…కోమటిరెడ్డి కావాలని రాజీనామా చేస్తేనే ఉపఎన్నిక వచ్చింది. కోమటిరెడ్డికి ఫాలోయింగ్ ఉంది గాని…ఈటల అంత లేదు. ఈటల మాదిరిగా ఉండుంటే…నియోజకవర్గంలో తిరిగితే అక్కడకక్కడ కాంగ్రెస్ శ్రేణులు కోమటిరెడ్డిని అడ్డుకునే పరిస్తితి లేదు. కావాలని కాంగ్రెస్ పార్టీని వీడి…రాజకీయంగా బీజేపీలో చేరారనే కోపం అక్కడి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు పూర్తి స్థాయిలో కోమటిరెడ్డి వెనుక రాలేదు.

పైగా ఇక్కడ టీఆర్ఎస్‌పై కోపం ఉండాలంటే…కోమటిరెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి. కానీ టీఆర్ఎస్ అలా చేయలేదు. ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత తప్ప…అక్కడ స్పెషల్‌గా వ్యతిరేకత లేదు. పైగా గత ఎన్నికల్లో అక్కడ ఓడిపోవడం టీఆర్ఎస్ ‌పార్టీకి కాస్త ప్లస్…అలాగే కమ్యూనిస్టులు మద్ధతు ఇవ్వడం ప్లస్సే. ఇటు కోమటిరెడ్డికి ఎక్కువ పాజిటివ్ మాత్రం ఉన్నట్లు కనిపించడం లేదు. ఈయన సొంత బలంతో గెలిచే పరిస్తితి కూడా కనిపించడం లేదు. కాకపోతే బీజేపీ బలం పెరగడమే కలిసొచ్చే అంశం. చూడాలి మరి మునుగోడులో కోమటిరెడ్డి గెలిచి బయటపడతారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news