వాలంటీర్ల వ్యవస్థను రద్దు సుప్రీం కోర్టు లో పిటిషన్… రేపే విచారణ!

-

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ని సక్సెస్ ఫుల్ గా గెలిపించి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన చాలా పథకాలలో వలంటీర్ల వ్యవస్థ చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి. దీని ద్వారా ముఖ్యంగా గ్రామాలలో పేదలు చాలా లబ్ది పొందుతున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం రాజకీయ కక్షతో ఈ వ్యవస్థను రద్దు చేయడం కోసం తెరవెనుక పన్నాగాలు పన్నుతున్నాయి. అందులో భాగంగా సుప్రీమ్ కోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ పిటిషన్ ను దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ ను సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనం రేపు విచారించనుంది. వాలంటీర్లను వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికలకు విధులను కేటాయించకుండా దూరంగా ఉంచాలంటూ మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ ఆద్వర్యంలోని సిటిజెన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఈ పిటిషన్ లో వివరాలను పొందుపరిచింది.

అధికార పార్టీ ఎన్నికల్లో వలంటీర్ల ద్వారా లబ్ది పొందడానికి చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణిస్తున్నారు. అందుకే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మారనున్న ఈ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని కోరడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news