బ్రేకింగ్‌ : రైతులకు సుప్రీం కోర్టు గుడ్‌ న్యూస్‌

ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులకు సుప్రీంకోర్టు లో ఊరట లభించింది. తాజాగా సింఘూ పరిసర సోనిపట్ నివాసితులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సింఘు సరిహద్దును రైతులు అనధికారికంగా మూసి వేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు సోనిపట్‌ నివాసితులు. రైతులు గత కొన్ని నెలలుగా రహదారిని దిగ్బంధించి.. భైఠాయించారని.. దీని వల్ల సాధారణ ప్రజల హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని ధర్మాసనంకు వివరించారు పిటిషనర్‌ తరపు న్యాయవాది.

రహదారులను దిగ్భంధించరాదని ఆగస్టు 23న సుప్రీంకోర్టు చెప్పిందని, ఈ సమస్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కారం కనుగొనాలని పేర్కొన్నారు న్యాయవాది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల దృష్ట్యా పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిపారు న్యాయవాది. జాతీయ రహదారిని కనీసం ఒకవైపు అయినా తెరిచేందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు పిటిషనర్‌. అయితే ఈ కేసు విచారణకు నిరాకరించింది జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం. ఢిల్లీ సరిహద్దు సింఘు వద్ద జాతీయ రహదారిపై రైతుల ధర్నాపై దాఖలైన పిటిషన్‌పై స్థానిక హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది సుప్రీంకోర్టు. పిటిషన్‌ ఉపసంహరణకు అవకాశం కల్పిస్తూ.. స్థానిక హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతించింది ధర్మాసనం. దీంతో ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులు ఊరట లభించింది. ఈ వ్యవహారంలో.. హైకోర్టు విచారణ చేయడమే సబబు అని.. సామాన్యుడి రోజు వారీ సమస్యలను హైకోర్టు పరిశీలిస్తుందని తెలిపింది.