పాలమూరు యూనివర్సిటీలో షర్మిల దీక్ష

వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిల.. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టినప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్‌ షర్మిల పోరాటం చేస్తున్నారు. అలాగే… ట్విట్టర్‌ మరియు ఇతర సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు వైఎస్‌ షర్మిల. ఈ నేపథ్యం లోనే… తెలంగాణ రాష్ట్రం లోని నిరుద్యోగుల సమస్యల పై దృష్టి సారించారు.

వైఎస్ ష‌ర్మిల‌ | Ys Sharmila
వైఎస్ ష‌ర్మిల‌ | Ys Sharmila

ఇందులో భాగంగానే ప్రతి మంగళవారం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో నిరుద్యోగ దీక్ష లు నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పటికే పలు జిల్లాల్లో నిరుద్యోగ దీక్ష చేసిన షర్మిల రేపటి రోజున… పాలమూరు యూనివర్సిటీ వద్ద వైఎస్ షర్మిల… నిరుద్యోగ దీక్ష చేయనున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగవారం – నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష కార్యక్రమంలో భాగంగా ఈ దీక్ష చేస్తున్నారు. కాగా.. గత మంగళవారం.. గజ్వేల్‌ నియోజక వర్గంలో షర్మిల దీక్ష చేసిన సంగతి తెలిసిందే.