జీవో 115పై హైకోర్టు తీర్పు సమర్థించిన సుప్రీంకోర్టు..

-

సుప్రీంకోర్టులో వైఎస్‌ జగన్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జీవో 115పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. విశాఖ వ్యాపారవేత్త కాట్రగడ్డ లలితేష్‌ ఉమార్‌కు మర్రిపాలెంలో కేటాయించిన 17,135 చదరపు మీటర్ల భూమిని వెనక్కి తీసుకుంటూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సర్కార్‌ నిర్ణయాన్ని లలితేష్‌ కుమార్‌ హైకోర్టులో సవాల్‌ చేయగా.. జీవో 115ని కొట్టేస్తూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. ఆ తరువాత సీజేఏ పీకే మిశ్రా ధర్మాసనం కూడా సింగిల్‌ బెంచ్‌ తీర్పును సమర్థించింది. ఈ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగ్గా.. హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. కాట్రగడ్డ లలితేష్‌ కుమార్‌కు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకోవాలనుకున్న ఏపీ ప్రభుత్వం నిర్ణయం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Supreme Court directs MP govt to re-examine 'wholesale' reservation for  state residents in B.Ed admission

అయితే సింగిల్ బెంచ్ తీర్పును గతంలోనే హైకోర్టు సీజే ధర్మాసనం సమర్థించింది. దీంతో హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఏపీ హైకోర్టు తీర్పుతో ఏకీభవించింది. ప్రభుత్వ నిర్ణయం సరికాదని స్పష్టం చేసింది. ప్రభుత్వమే స్థలం ఇచ్చి వెనక్కి తీసుకుంటుందా అని ప్రశ్నించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news