వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

-

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30లోగా విచారణ ముగించాలని తెలిపింది. 6 నెలల్లోపు విచారణ మొదలు పెట్టకపోతే ఎ – 5 బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. విచారణ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో పేర్కొన్న విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని తెలిపింది. గతంలో ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా చేపట్టాలని ఇదే కోర్టు ఆదేశించిందని సిబిఐ దాఖలు చేసిన నివేదికను పరిగణలోకి తీసుకున్నట్లుగా సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే అదనపు ఛార్జ్ షీట్ ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇక ఈ కేసులో ప్రస్తుతం దర్యాప్తు అధికారిగా ఉన్న రాం సింగ్ ను సిబిఐ తప్పించింది.

Read more RELATED
Recommended to you

Latest news