రిజర్వ్ బ్యాంక్ కు సుప్రీం నోటీసులు…

-

దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా శుక్రవారం నోటీసులు జారీ చేసింది.  సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారాన్ని ఇవ్వడంలో ఆర్బీఐ నిరాకరించినందుకు వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీం కోరింది. బ్యాంకుల్లో జరిపిన తనిఖీలు, సహారా గ్రూపునకు చెందిన కంపెనీల్లో జరిగిన అవకతవలకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద ఓ దరఖాస్తుదారుడు కోరిన నివేదికలను ఇవ్వడానికి ఆర్బీఐ నిరాకరించింది. దీంతో దరఖాస్తుదారుడు వేసిన పిటిషన్‌ ఆధారంగా జస్టిస్‌ నాగేశ్వర్‌ రావు నేతృత్వంలోని ధర్మాసనం ఆర్బీఐకి నోటీసులు జారీ చేసింది.

ఏప్రిల్, 2011 నుంచి ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐల్లో చేపడుతున్న తనిఖీల వివరాలను వివరించాలని కోరారు. అయితే దీనికి ఆర్బీఐ నిరాకరించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది… ‘సమాచార నిరాకరణ’ కిందికే వస్తుందని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. భారత అత్యున్నత బ్యాంక్ కి కోర్టు నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశ మైంది.

Read more RELATED
Recommended to you

Latest news