ఏపీ మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ కు సుప్రీం షాక్..

Join Our COmmunity

సుప్రీంకోర్టు మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కు షాక్ తగిలింది. ఆయనకు సంనందించి ఏపీ హైకోర్టు ఇచ్చిన మీడియా గ్యాగ్ ఆర్డర్ పై స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టులో దమ్మాలపాటి శ్రీనివాస్ కేసు విచారణ ప్రారంభం అయ్యింది. అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. అమరావతి భూ కుంభకోణం కేసులో దమ్మాలపాటి శ్రీనివాస్ సహా 13 మంది నిందితులపై ఏపీ అవినీతి నిరోధక శాఖ కేసులు నమోదు చేసింది. అమరావతిలో ఇన్‍సైడర్ ట్రేడింగ్ ద్వారా కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.

అయితే ఏసీబీ కేసు దర్యాప్తుపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది కేసు వివరాలు మీడియాలో రిపోర్ట్ చేయొద్దని గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఏపీ హైకోర్టు ఇచ్చిన మీడియా గ్యాగ్ ఆర్డర్ పై స్టే ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి చివరి వారానికి వాయిదా వేశారు. అప్పటి దాకా ఈ కేసు ను ఫైనల్ డిసైడ్ చేయవద్దని హైకోర్టుని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదిస్తున్నారు. తనపై చర్యలు తీసుకోవద్దని దమ్మాలపాటి కోర్టును ఆశ్రయిస్తే 13 మందికి వర్తింపజేశారని, పిటిషనర్ అడగకుండానే ఇలాంటి ఆదేశాలు ఎలా పాస్ చేస్తారని ప్రభుత్వం ప్రశ్నించింది.

TOP STORIES

మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో తడబడుతున్నారా? ఈ విషయాలు తెలుకోండి..

పెళ్ళి.. ఇద్దరి జీవితాలను ఒకటి చేసేది. ఇద్దరు వ్యక్తులను ఒకే దారిలో నడిపేది. మానవుడు అభివృద్ధి చెందుతున్న పరిణామ క్రమంలో పెళ్ళనేది అతడు సృష్టించుకున్న అత్యంత...