Suriya 42 : 10 భాషల్లో సూర్య 42వ సినిమా – మోషన్ పోస్టర్‌ రిలీజ్‌

-

టాలీవుడ్​లో బలమైన మార్కెట్‌ను సొంతం చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకుల్లో ఒకరిగా.. బలమైన అభిమాన గణమున్న హీరోల్లో ఒకరిగా సూర్య గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా, నిర్మాతగా, టెలివిజన్‌ వ్యాఖ్యాతగా కూడా ఆయనకు మంచి పేరు ఉంది. హీరోగా ఇప్పుడు తన కెరీర్ లో సాలిడ్ లైనప్ ని సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

అలాగే తన కెరీర్ లో 42వ సినిమాని దర్శకుడు శివతో అనౌన్స్ చేయగా దీనిపై భారీ అంచనాలు నెలకొనగా నిన్ననే ఈ సినిమా నుంచి ఓ క్రేజీ మోషన్ పోస్టర్ వస్తుంది అని కూడా సాలిడ్ అప్డేట్ ఇవ్వగా ఇప్పుడు పోస్టర్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, మేకర్ ఈ పోస్టర్ ని అనుకున్న టైముకే రిలీజ్ చేసేసారు.

అయితే ఈ మోషన్ పోస్టర్ టీజర్ మాత్రం అసలు ఊహించని లెవెల్ లో సెన్సేషనల్ విజువల్స్ తో ఉందని చెప్పాలి. అలాగే దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన స్కోర్ అయితే ఈ టోటల్ టీజర్ కె భారీ హైప్ ని తెచ్చి పెట్టింది. ఇంకా ఈ విజువల్స్ తో చూస్తే ఈ సినిమా ఒక భారీ పీరియాడిక్ డ్రామాలా కనిపిస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని ఏకంగా 10 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా తెలిపారు. మరి ఈ సినిమా అయితే ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news