RC 15 నుంచి బిగ్‌ అప్డేట్‌..విలన్‌ ఎంట్రీ అదుర్స్‌ !

-

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC 15 ఫిల్మ్ చేస్తు్న్నారు. ఈ పిక్చర్ నుంచి ఏదేని అప్ డేట్ కోసం మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. RRR ఫిల్మ్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ఇది. కాగా, ఇందులో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది.

అయితే ఈ చిత్రానికి.. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. దాంతో గతంలో అధికారి, స‌ర్కారోడు వంటి టైటిల్స్‌ తెరపైకొచ్చాయి. కానీ తాజాగా ఈ సినిమా టైటిల్స్ రేసులో మ‌రో కొత్త టైటిల్ వచ్చి చేరింది. ఇటు మాస్‌.. అటు క్లాస్ ఆడియెన్స్‌కి న‌చ్చేలా ఈ చిత్రానికి సీఎం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ఇక్క‌డ సీఎం అంటే చీఫ్ మినిస్ట‌ర్ అనే అర్థంలో కాకుండా.. కామ‌న్ మ్యాన్ అని తీసుకోబోతున్నారట. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో ఎస్‌ జే సూర్య నటిస్తున్నారు. ఆయన విలన్‌ పాత్రలో కనిపించనున్నారని టాక్‌. అయితే.. ఇవాళ ఆయన ఈ సినిమా షూటింగ్‌ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news