కమల్ హాసన్ ‘విక్రమ్’లో సూర్య..ఫొటోలు లీక్

-

లోకనాయకుడు కమల్ హాసన్- యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్’. కాగా, ఈ సినిమాలో ఎవరూ ఊహించని సర్ ప్రైజ్ ఉండబోతుందని ఇటీవల ప్రకటించిన మేకర్స్ తాజాగా ఆ సర్ ప్రైజ్ రివీల్ చేశారు. కీలకమైన పాత్రలో వెర్సటైల్ యాక్టర్ సూర్య కనిపిస్తారని తెలిపారు. కాగా, సోషల్ మీడియాలో సూర్య పాత్రకు సంబంధించిన స్టిల్స్ రివీల్ అయ్యాయి. సదరు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ‘విక్రమ్’ సినిమాలోని సూర్య పాత్రకు సంబంధించిన ఫొటోలు లీకయ్యాయి. సదరు ఫొటోల్లో వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ ధరించి సూర్య కనబడుతున్నారు. ఓ కత్తి రక్తంతో అలా భూమ్మీద దించబడి ఉంది. థియేటర్ లో ఈ సీన్ వచ్చినపుడు ప్రేక్షకులు ఊగిపోతారని ఈ ఫొటోలు చూసి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్స్ విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్(ఫఫ)లు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది జూన్ 3న ఫిల్మ్ రిలీజ్ కానుంది. మొత్తంగా ‘విక్రమ్’ సినిమా అభిమానుల అంచనాలను మించి ఉండబోతున్నదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news