సీఎం జగన్ సర్కార్ కి పవన్ సూటి ప్రశ్న..!

రాజమండ్రిలో ఓ 16 ఏళ్ల బాలికపై కొందరు కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారనే వార్త తీవ్రంగా కలచి వేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 4 రోజుల పాటు చిత్ర హింసలకు గురి చేసిన ఆ మృగాళ్లను కఠినంగా శిక్షించాలని‌ కోరారు. తన కుమార్తె ఆచూకీ తెలియడం లేదని తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే సకాలంలో స్పందించలేదని తెలిసిందని తెలిపారు. దిశ చట్టం, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు.

అసలు దిశ  చట్టం ఇంకా ఎందుకు అమలు కావట్లేదని నిలదీశారు. తొలి దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటైన రాజమండ్రిలోనే ఈ గ్యాంగ్ రేప్ జరగిందన్న పవన్ కళ్యాణ్… బ్లేడ్ బ్యాచ్‌లు, డ్రగ్స్ ముఠాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. చట్టాల్ని నిబద్ధతతో అమలు చేసినప్పుడే మహిళలకు రక్షణ ఉంటుందని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు.