స్నానం చేయిస్తానని ఓనర్స్ ను బాత్రూంలోకి తీసుకెళ్లి.. ఆ పనిమనిషి ఏం చేస్తుందంటే?

-

పనిమనిషి ముసుగులో ఓ మహిళ చేసే నిర్వాకం అంతా ఇంతా కాదు. ఇంటి పని చేస్తానని యజమానుల దగ్గరికి వెళ్తుంది. డబ్బు ఎక్కువగా ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసుకుంటుంది. ఆ ఇంట్లో వయసు ఎక్కువగా ఉండే వ్యక్తులు ఉండేలా చూసుకుంటుంది. వారి అవసరాలను, ఇష్టాలను తెలుసుకుంటుంది. మెల్లిగా ఇంట్లో ప్రవేశించి.. యజమానులకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తుంది. అన్ని పనులు చేస్తూ యజమానుల విశ్వాస్వాన్ని గెలుచుకుంటుంది.

మసాజ్-పనిమనిషి
మసాజ్-పనిమనిషి

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ బెంగళూరుకు పనికోసం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. లక్ష్మీ పేరుతో యజమానులకు దగ్గరవుతుంది. పనిలో చేరిన తర్వాత ఇంట్లో ఉన్న వృద్ధులకు మసాజ్ చేయిస్తానని బాత్రూంలోకి తీసుకెళ్తుంది. వాళ్లకు స్నానం చేయించే సమయంలో ఇంట్లో ఉన్న బంగారం, డబ్బులు దొంగలిస్తుంది. అనంతరం అక్కడి నుంచి పారిపోతుంది. మారతపల్లిలో కూడా ఇలాగే దొంగతనానికి పాల్పడింది. దీంతో యజమానులు కేసు నమోదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు రూ.13 లక్షలు, 271 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news