Breaking : అంగారకుడిపై నూడుల్స్‌..? ఫోటో పంపిన నాసా రోవర్‌

-

తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో రెండు రాళ్ల మధ్య నూడుల్స్ ఆకారంలో ఉన్న ఓ పదార్థం ఉన్న ఫోటోను నాసా రోవర్ చిత్రీకరించింది. దానిముందువైపున్న కెమెరాలు ఈ పదార్థాన్ని తమ కెమెరాలో బంధించాయి. అయితే, ఈ పదార్థం ఏంటన్న విషయంలో శాస్త్రవేత్తలు కచ్చితంగా ఓ అంచనాకు రాలేకపోతున్నారు. చూడ్డానికి మాత్రం ఎండిపోయిన ఓ చిన్న గడ్డిమొక్కలా ఉంది.

గత నెలలో కూడా రోవర్ పంపిన ఓ ఫొటో ఆసక్తిని రేకెత్తించింది. మార్స్‌‌పైన జెజోరో క్రేటర్ వద్ద మెరిసే పదార్థం ఫొటో తీసి పంపింది. అయితే, దానిని మార్స్ రోవర్ నుంచి విడిపోయిన వ్యర్థ పదార్థంగా తర్వాత గుర్తించారు. కాగా, అంగారకుడిపై నాసా పంపిన పెర్సవరెన్స్ రోవర్ ఈ ఏడాది ఫిబ్రవరితో ఏడాది పూర్తి చేసుకుంది. మార్స్‌పై దాని అన్వేషణ ఇంకా కొనసాగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news