తెలంగాణ, ఏపీని మళ్లీ కలుపుతారా ? : తలసాని సంచలనం

-

నిన్న పార్లమెంటు లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజనపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తలుపులు వేసి, చర్చలు లేకుండానే తెలుగు రాష్ట్రాన్ని విడగొట్టాలని కాంగ్రెస్ పై మండిపడ్డారు. అయితే దీనిపై తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ వైఖరి చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ కలుపుతారో ఏమో అని అనుమానం వస్తుందని… పేర్కొన్నారు. రాజ్యసభలో ప్రధాని మోడీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ఇన్ని సంవత్సరాల నుంచి మోడీ… గుడ్డి గుర్రాల పండ్లు తోమారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ తెలంగాణకు క్షమాపణ చెప్పాలని… వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని… లేదంటే దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్నింగ్‌ ఇచ్చారు. ప్రధాని తెలంగాణ పై తన అక్కసు వెళ్లగక్కారని… బడ్జెట్ మీద ప్రసంగించాల్సిన ప్రధాని ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు. దేశంలో తెలంగాణ ఉందొ, లేదో అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తోందని.. దుర్మార్గంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news