కరోనా తెచ్చిన కరువు.. 3నెలల పిల్లాడిని అమ్ముకున్న తమిళనాడు జంట.

కరోనా కారణంగా వచ్చిన లాక్డౌన్ ఎన్నో జీవితాలని నాశనం చేసింది. ఉద్యోగాలు లేక ఉపాధి కోల్పోయి జీవన భారాన్ని ఎలా సాగించాలో తెలియక అనేక అనైతిక చర్యలకి పాల్పడుతున్నవారు రోజు రోజుకీ పెరుగిపోతున్నారు. తాజాగా తమిళనాడులోని ఒక జంట తమ జీవితం గడపడానికి డబ్బులు లేవని మూడు నెలల పిల్లాడిని అమ్ముకున్న వైనం అందరికీ షాకిస్తుంది. పోలీసుల కథనం ప్రకారం తమిళనాడులోని తిర్పూర్ జిల్లాలోని కంగేయం దగ్గర నివసించే ఎన్ మురుగన్, తన భార్య ప్రసవం జరిగిన మూడు నెలలకి పాపని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు.

స్థానికంగా మగ్గం పనిచేసే మురుగన్ కి లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయాడూ. ప్రసవం తర్వాత అతని భార్య కూడా పనిచేయడానికి లేకుండా పోయింది. దాంతో జీవితం గడవడం కష్టమవుతుందని భావించిన ఆ ఇద్దరు, తమ మూడు నెలల పిల్లాడిని 10వేల రూపాయలకి అమ్మేసారు. ప్రస్తుతం ఈ జంట పోలీసుల కస్టడీలో ఉన్నారు. పిల్లాడిని కొనుక్కున్న వారు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు.