నన్ను కేసీఆర్ ప్రభుత్వం అవమానించింది..ఇది ప్రధాని మోడీకి కూడా తెలుసు..దీనిపై ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గవర్నర్ తమిళిసై.. ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అని.. నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను అని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తాను సఖ్యత గానే ఉండడానికి ప్రయత్నించాను.. నేను తెలంగాణలో అధికారం చెలాయించడం లేదని స్పష్టం చేశారు. నేను స్నేహపూర్వకమైన, రాజ్యాంగబద్ధమైన వ్యక్తిని అంటూ గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఈ చర్యలు తనను ఆపలేమని.. రాజ్ భవన్, గవర్నర్ ను అవమానించారు .. అయినా నేను పట్టించుకోను అని వెల్లడించారు. నాకు ఇలాంటి ఇవ్వలేదంటూ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు గవర్నర్ ప్రోటో కాల్ తెలీదా అని నిలదీశారు. నాతో భేటీ కోసం సీఎం కేసీఆర్ ఎప్పుడైనా ఆఫీస్ కు రావచ్చు… దేనిపైన అయినా చర్చించేందుకు తాను సిద్ధమేనని స్పష్టం చేశారు తమిళి సై.