లెజెండరీ క్రికెట్ కోచ్ మృతి..విషాదంలో రిషబ్ పంత్ !

-

క్రీడా రంగంలో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ క్రికెట్‌ కోచ్‌… ద్రోణా చార్య అవార్డు విన్నర్‌ తారక్‌ సిన్హా మృతి చెందారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ తో పోరాడుతున్న తారక్‌ సిన్హా… ఇవాళ ఉదయం మరణించారు. ఢిల్లీ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారక్‌ సిన్హా.. పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.

ఢిల్లీకి చెందిన తారక్‌ సిన్హా కు 2018 లో ద్రోనా చార్య అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని సోనెట్‌ క్రికెట్‌ క్లబ్‌ లో తారక్‌ సిన్హా కోచ్‌ గా పనిచేశారు. అయితే.. తారక్‌ సిన్హా మృతి పట్ల టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌.. తీవ్ర దిగ్ర్భాంతి కి గురయ్యాడు. ”ఆటగాళ్ళు అతనికి సంఖ్యలు మాత్రమే! దేశానికి అసాధారణమైన అంతర్జాతీయ క్రికెటర్లను అందించడానికి అతను తన జీవితం అంకితం చేశారు. చివరగా, ఆ నిరీక్షణ ముగిసింది. అతనికి చాలా అర్హత కలిగిన ద్రోణాచార్య అవార్డు లభించింది! తారక్ సిన్హా సార్ యు ఆర్ ది బెస్ట్” అంటూ ట్వీట్‌ చేశాడు రిషబ్‌.

Read more RELATED
Recommended to you

Latest news