దళితబంధు బందేనా…కేసీఆర్ సారు కిరికిరి ఏంటో?

-

ఊహించని విధంగా సీఎం కేసీఆర్…హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టాలని చెప్పి..అనేక పథకాలని అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు అనే భారీ స్కీమ్‌ని తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వడానికి కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే హుజూరాబాద్‌లో దాదాపు అమలు చేసింది. అయితే చివరిలో ఎన్నికల కోడ్ రావడంతో దళితబంధుకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది..అయితే దళితబంధుని బీజేపీనే కుట్ర పన్ని ఆపిందని, హుజూరాబాద్ ఫలితం వచ్చిన వెంటనే స్కీమ్ అమలు చేస్తామని టీఆర్ఎస్ నేతలు చెప్పారు.

kcr
kcr

ఇక కేసీఆర్ యథావిధిగా తన మాటలతో ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అసలు ఎన్నిక ఫలితం 2వ తేదీన రాగానే, 4వ తేదీన తానే కూర్చుని పథకం అమలు చేసేస్తానని కేసీఆర్ చెప్పేశారు. అయితే దళితబంధు స్కీమ్ పూర్తిగా రివర్స్ అయిన విషయం తెలిసిందే. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల విజయం సాధించేశారు. అలాగే సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దళితబంధు, రైతుబంధు పథకాలను ప్రారంభించిన శాలపల్లి, చుట్టుపక్కల గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‎కు లీడ్ వచ్చింది.

ఇక ఫలితం వచ్చి నాలుగు రోజులైనా సరే కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు ఊసు ఎత్తడం లేదు. ఇప్పటికే ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు దళితబంధు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు దీనిపై ఎలాంటి స్పందన ఇవ్వట్లేదు. కాకపోతే దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దేశంలోనే మొదటిసారి కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకం సంపూర్ణంగా అమలై తీరుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయించాలని డిమాండ్ చేశారు.

అయితే అమలు చేస్తామని అంటున్నారు గానీ, మళ్ళీ ఎప్పటినుంచి స్టార్ట్ చేస్తారనేది చెప్పడంలేదు…అసలు రాష్ట్రమంతా దళితబంధు ఇస్తారా లేక బంద్ చేసేస్తారా అనే అంశం కూడా క్లారిటీ లేదు. మొత్తానికైతే దళితబంధులో కేసీఆర్ ఏదో కిరికిరి చేసేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news