‘రంగా’ కోసం టీడీపీ-వైసీపీ పోటీ..మధ్యలో ముద్రగడ.!

-

ఏపీలో కాపు కులం టార్గెట్ గా రాజకీయం ఆసక్తికరంగా సాగుతుంది. అత్యధికంగా ఉన్న కాపు ఓట్లని కొల్లగొట్టడానికి అటు వైసీపీ, ఇటు టీడీపీ గట్టిగానే ట్రై చేస్తున్నాయి. తాజాగా కాపు ఓట్లని ఆకర్షించడానికి వంగవీటి రంగా వర్ధంతిని వేదికగా చేసుకున్నారు. ఎవరికి వారు పోటీగా రంగా వర్ధంతి కార్యక్రమాలు చేశారు. ఆ పోటీ ఎంతవరకు వచ్చిందంటే..గుడివాడలో టీడీపీ వాళ్ళు రంగా వర్ధంతి చేయవద్దని కొడాలి నాని అనుచరులు వార్నింగ్ ఇవ్వడం, టీడీపీ ఆఫీసుపై దాడి చేయడం వరకు వచ్చింది.

అంటే రంగా వర్ధంతి చేస్తే మళ్ళీ కాపులు టీడీపీ వైపు మొగ్గుచూపుతారనే టెన్షన్ వైసీపీలో పెరిగిందని టీడీపీ ఫైర్ అవుతుంది. ఇక ఇలా రెండు పార్టీలు వర్ధంతి కార్యక్రమాల్లో మునిగి తేలాయి. అటు రంగా తనయుడు రాధా..రెండు పార్టీలు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఓ వైపు కొడాలి నాని, వల్లభనేని వంశీలతో పాటు రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనగా, మరోవైపు టీడీపీ నేత బోడే ప్రసాద్, జనసేన నేత పోతిన మహేశ్‌లతో పాటు రాధా…రంగా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు విశాఖ వేదికగా కాపు నాడు జరుగుతుండగా, ఈ  కార్యక్రమానికి వైసీపీ నేతలు హాజరు కాకూడదని జగన్ ఆదేశాలు జారీ చేశారు.

ఇలా కాపుల ఓట్ల వేటలో టీడీపీ-వైసీపీలు ఉంటే మధ్యలో ముద్రగడ పద్మనాభం ఎంట్రీ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఈ‌డబల్యూ‌ఎస్ పై ఇచ్చిన తీర్పు,  రిజర్వేషన్లు రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని కేంద్రమంత్రి  ఇచ్చిన సమాధానం పై దృష్టి పెట్టాలని జగన్‌కు లేఖ రాశారు.  అగ్రవర్గాల పేదలకు కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తే..గత చంద్రబాబు ప్రభుత్వంలో అందులో 5 శాతం కాపులకు కేటాయించింది.

కానీ జగన్ వచ్చాక ఒక్క కులానికే 5 శాతం ఇవ్వడం కుదరదని..అసలు 10 శాతం అమలు చేయట్లేదు. తాజాగా కేంద్రం..ఈ రిజర్వేషన్లు ఎలాగైనా అమలుచేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని చెప్పింది. దీంతో కాపులకు 5 శాతం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది..ఈ క్రమంలోనే ముద్రగడ కూడా ఈ డిమాండ్ చేశారు. కాకపోతే జగన్‌ని సున్నితంగా రిక్వెస్ట్ చేశారు. అందుకే చివరిలో తన  జాతి కోసం తపన తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన నాకు లేదని లేఖలో వివరణ ఇచ్చారు. కానీ ఇదే ముద్రగడ..చంద్రబాబు అధికారంలో ఉండగా  ఏ స్థాయిలో పోరాటం చేశారో తెలిసిందే. అప్పుడు బాబుని నెగిటివ్ చేసి..పరోక్షంగా జగన్‌కు బెనిఫిట్ అయ్యేలా చేశారు. చివరికి జగన్ అధికారంలోకి వచ్చాక కాపు రిజర్వేషన్లపై పోరాటం ఆపేశారు. ఇప్పుడు ఇలా 5 శాతం ఇవ్వాలని జగన్‌ని రిక్వెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news